రేపు కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
3 Nov, 2025 16:30 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (04.11.2025, మంగళవారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించి, అక్కడే రైతులతో మాట్లాడునున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరు చేరుకుంటారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.