రేపు పులివెందులకు వైయస్ జగన్
20 Apr, 2026 09:54 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
తన పర్యటనలో భాగంగా వైయస్ జగన్ మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మరుసటిరోజు(22న) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు. స్థానిక వైయస్ఆర్‌సీపీ నేత సుధాకర్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ ఓదార్చనున్నారు. తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం పర్యటన ముగించుకుని పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.