ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షికి వైయస్ జగన్ పరామర్శ
29 Dec, 2025 18:14 IST
తాడేపల్లి: మోకాలు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా విరుపాక్షి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైయస్ జగన్ గారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆయన కోరారు. పార్టీ అధ్యక్షుని నుంచి వచ్చిన పరామర్శకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విరుపాక్షి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.