సాకే గంగమ్మ మృతికి వైయస్ జగన్ సంతాపం
21 Nov, 2025 13:16 IST
అనంతపురం: వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Shailajanath) మాతృమూర్తి సాకే గంగమ్మ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు ఇవాళ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. ఆమె మరణం పట్ల వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు, గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.