టీడీపీ పాలనలో సంక్షేమం లేదు..పరిహారం రాదు..

1 Jan, 2019 16:20 IST

శ్రీకాకుళంఃవైయస్‌ జగన్‌ను కలిసిన శ్రీరాంనగర్‌ మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తిత్లీ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, చెక్కులు ఇచ్చినా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం సరఫరా చేయడం వైయస్‌ జగన్‌కు గోడు వెల్లబుచ్చారు.బ్రహాడపల్లి వద్ద వైయస్‌ జగన్‌ను  ప్రజాసంఘాల నేతలు కలిశారు. తిత్లీ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. పరిహారం పేరుతో ప్రభుత్వం పరిహాసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా సాయం చేసిన వారితో పాటు ప్రశ్నించినవారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని జగన్‌కు  ప్రజా సంఘాలు వివరించాయి. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి జంతిబంద వరుకు పొడిగిస్తే ఉద్దానం నీటి సమస్య పరిష్కారమవుతుందని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. టీడీపీ నేతలు, వారి అనుచరులకు తప్ప మరెవరికీ పరిహారం అందలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కేసులు ఎత్తివేయడంతో పాటు పరిహారం అందరికీ చెల్లిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ను  యాదవ సంఘం నేతలు కలిసి తమ మొర వినిపించారు. తమను బీసీ(డి) కేటగిరి నుంచి బీసీ(ఎ) కేటగిరిలో చేర్చడంతో పాటు తమ అభ్యున్నతికి కృషిచేయాలని కోరుతూ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.