నేడు స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైయస్ భేటీ
8 May, 2025 11:05 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాల నేతలతో భేటీ కానున్నారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతోపాటు రామకుప్పం, రొద్దం మండల నేతలతో వైయస్ జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉంది.