రేపు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటి

30 Apr, 2025 19:58 IST


తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (01.05.2025) కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక‌ సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.

స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా గురువారం తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం  వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో  సమావేశం జ‌రుగ‌నుంది. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వనించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు.