నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ నేతలతో వైయస్ జగన్ సమావేశం
11 Dec, 2024 08:25 IST
తాడేపల్లి : ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలకు త్వరలో నిర్వహించే ప్రజా పోరాటాలపై దిశానిర్ధేశం చేయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.