ప్రభల తీర్థం.. ప్రజలకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
16 Jan, 2026 18:19 IST
తాడేపల్లి: కోనసీమ వ్యాప్తంగా నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు .