సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు వైయస్ జగన్ శుభాకాంక్షలు
24 Nov, 2025 12:40 IST
తాడేపల్లి: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కి వైయస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలుపుతూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా..
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలాన్ని సంతృప్తికరంగా, విజయవంతంగా కొనసాగించాలని ఆక్షాంక్షించారు.