ఇస్రో శాస్త్రవేత్తలకు వైయస్ జగన్ అభినందనలు
24 Dec, 2025 12:26 IST
తాడేపల్లి: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.
వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా..
`ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్‌ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు’ అని వైయస్ జగన్ పోస్టు చేశారు.