మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
13 Aug, 2025 10:35 IST
తాడేపల్లి: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేల మృతి బాధాకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్టు చేశారు.