వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
8 Feb, 2025 11:16 IST
బెంగళూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్.విశ్వనాథ్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. త్రిపుర వాసిని ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో వైయస్ జగన్ నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.