సాకే శైలజానాథ్‌కు వైయస్ జగన్ పరామర్శ
22 Nov, 2025 09:34 IST
తాడేపల్లి: శింగనమల వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ గారి తల్లి సాకే గంగమ్మ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. గంగమ్మ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.