బాలిక కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
7 Jul, 2024 16:42 IST
వైయస్‌ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఆదివారం వైయస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హామీ ఇచ్చారు.