యర్రం పిచ్చెమ్మ సంస్మరణ సభ
ప్రకాశం జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి యర్రం పిచ్చెమ్మ ఇటీవల కన్నుమూశారు. సోమవారం ఒంగోలులోని వైవీ సుబ్బారెడ్డి స్వగృహంలో పిచ్చెమ్మ సంస్మరణ సభను నిర్వహించి, ఆమె చిత్రపటానికి పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, బంధువులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంస్మరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు అనంతబాబు, కావూరి శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా , నిడదవోలు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రంపచోడవరం నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, రుడా మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.