మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్షత అనాగరికం

30 Jun, 2021 14:51 IST

 
విశాఖపట్నం:  టీడీపీ నేత అశోక్ గజపతి వైఖరిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండి పడ్డారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్షత అనాగరికమని ఆమె అన్నారు. సంచయిత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. ఆర్మీలో నియామకంపై సుప్రీంకోర్టే మహిళలను సమర్థించిందని, సంచయిత విషయంలో అశోక్ వ్యవహారంపై చర్చకు సిద్దమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.