వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
1 Jul, 2025 17:52 IST
విజయవాడ: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు వల్లభనేనికి వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో భాగంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైనట్లయ్యింది. రేపు వల్లభనేని వంశీ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.