తెలుగు అభ్యర్థులకు వైయస్ జగన్ అభినందనలు
23 Apr, 2025 10:24 IST
తాడేపల్లి: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు అభ్యర్థులకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. వారు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైయస్ జగన్ ట్వీట్ చేశారు.