వికేంద్రీకరణకు మద్దతుగా మండల మీట్‌లో ఏకగ్రీవ తీర్మానం
27 Oct, 2022 15:56 IST
విజయనగరం: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని జామి మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం జామి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జామి ఎంపీపీ సబ్బవరపు అరుణ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికేంద్రీకరణకు మద్దతుగా సభ్యులు ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. సమావేశానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),ఎస్ కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.