రేపు వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన
19 Feb, 2025 16:22 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (20.02.2025) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేరుకుంటారు. అక్కడ ఇటీవల మరణించిన వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి బెంగళూరు వెళతారు.