రేపు వైయస్ జగన్ పులివెందుల పర్యటన
10 Jan, 2025 21:57 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పులివెందులలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని వైయస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తిరిగి బెంగళూరు బయలుదేరి వెళతారు.