నేడు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం 

13 May, 2025 09:12 IST

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం మంగ‌ళ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరగనుంది.  పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌లు, మాజీ మేయర్లు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.