నేడు వైయస్ఆర్ నేతన్న నేస్తం నగదు బదిలీ
11 Nov, 2020 11:08 IST
అమరావతి: వైయస్ఆర్ నేతన్న నేస్తంలో మిగిలిపోయిన అర్హులైన 8,903 మంది చేనేత కార్మికులకు రూ.24 వేల చొప్పున సుమారు రూ.21.37 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. గతంలో వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రెండుసార్లు కలిపి ర81,703 మందికి రూ.362.42 కోట్లను సీఎం వైయస్ జగన్ అందించారు.