రేపు వినుకొండకు వైయస్ జగన్
18 Jul, 2024 13:48 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు వినుకొండలో పర్యటించనున్నారు. వినుకొండ నడిబొడ్డున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను టీడీపీ నాయకుడు కొబ్బరిబొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. రేపు(శుక్రవారం) వినుకొండలో రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు.