తిరుపతిలో ఉద్రిక్తత
26 Sep, 2025 13:10 IST
తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతత నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని, సర్టిఫైడ్ సైకో బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ వైయస్ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి నుంచి బాలకృష్ణ ను భర్తరఫ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ రికార్డ్ ల నుంచి బాలకృష్ణ వాఖ్యలు తొలగించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లం రవిచంద్ర రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ కోరారు.