వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి
4 Apr, 2025 11:49 IST
పల్నాడు: సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాల మండలం లంకెల కూరపాడు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం అత్యవసర చికిత్స కోసం నరసరావు పేట లోని జీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైయస్ఆర్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.