వైయస్ఆర్‌సీపీ నేత వాహనంపై రాళ్ల దాడి
15 Mar, 2025 10:58 IST
అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. బ్రహ్మసముద్రం వైయస్ఆర్‌సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి వాహనంపై పచ్చమూకలు రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బోలేరో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. మొలకాల్మూర్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు చంద్రశేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.