కాసేపట్లో సమర శంఖారావం
నెల్లూరు : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు హాజరయ్యారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అధినేత పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేస్తూ దిశా నిర్దేశం చేయనున్నారు. జిల్లాలోని పది శాసనసభా నియోజకవర్గాల్లో ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్‌లకూ కమిటీలు వాటికి కన్వీనర్లు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, కాకాణి గోవర్థన్‌రెడ్డితో సహా పలువురు నేతలు శంఖారావం కార్యక్రమ ఏర్పాట్లను పూర్తి చేశారు. నెల్లూరు నగరంలోని ఎస్‌వీజీఎస్ కళాశాల సెంటర్ వద్ద మైదానం వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో వైయస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.