సమర శంఖారావం సభ ప్రారంభం
5 Mar, 2019 15:13 IST
నెల్లూరు: నెల్లూరులోని ఎస్వీజీఎస్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్సీపీ సమర శంఖారావం సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. సభా ప్రాంగణానికి వైయస్ఆర్సీపీ అధినేత వైయస్జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముందుగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. జిల్లా నేతలు జననేతను సత్కరించారు.