నాపై కేసులన్నీ ఆరోపణలే

26 Feb, 2025 16:08 IST

విజయవాడ: తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. ఐదు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ నుంచి వంశీని జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు.