కాసేపట్లో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
26 Nov, 2021 11:00 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కాసేపట్లో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం వైయస్ జగన్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు.