వైయస్ఆర్, వైయస్ జగన్ ట్రెండ్ సెట్టర్స్
20 Sep, 2022 10:22 IST
అమరావతి: ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలని బాగా ఆలోచించిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ‘విద్య, వైద్యంలో నాడు–నేడు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైయస్సార్, వైయస్ జగన్ మాత్రమే ట్రెండ్ సెట్టర్లని చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినా 14 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని అన్నారు. ప్రజలు వలస వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని పిల్లలు బాగా చదువుకోవాలని సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.