వైయస్ఆర్‌సీపీలో నియామకాలు
29 Apr, 2026 11:32 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో నియమించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఎల్. కాంతారావు, బి.పద్మజలను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా, ఎల్. శ్రీరాములునాయుడును పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా, బి. వెంకటకృష్ణ రావును స్టేట్ వైయస్‌ఆర్‌టీయూసీ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.