రేపు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
14 Aug, 2024 19:37 IST
తాడేపల్లి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు.