నాలో..నాతో పుస్తకం ఆవిష్కరణ
8 Jul, 2020 09:41 IST
ఇడుపులపాయ: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా "నాలో.. నాతో వైయస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఆవిష్కరించారు.ఈ పుస్తకాన్నివైయస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రచించారు. వైయస్ఆర్ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం "నాలో.. నాతో వైయస్సార్". వైయస్సార్ సహధర్మచారిణిగా వైయస్ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం.