దృష్టి మరల్చడానికి చంద్రబాబు లేని ఎజెండాను ఎత్తుకున్నాడు
26 Sep, 2020 12:36 IST
తాడేపల్లి: 'భూకుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికి లేని ఎజెండాను చంద్రబాబు ఎత్తుకున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. శనివారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 'భూకుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికి లేని ఎజెండాను ఎత్తుకున్నాడు చంద్రబాబు.విజయవాడలోనే డజన్ల కొద్ది ఆలయాలను కూలగొట్టాడు. బీజేపీ కొన్ని వర్గాలకు వ్యతిరేకమంటూ ఎన్నికల ముందు నానా హంగామా చేశాడు. కశ్మీర్ నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.