ఏంటి కిట్టు ..మీ ఉచిత సలహాలు ఏలా?
12 Jul, 2020 13:23 IST
తాడేపల్లి: ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత రాధాకృష్ణపై వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంటి కిట్టు C/O ఆంధ్రజ్యోతి. రాజధాని వ్యవహారంపై బీజేపీ నేతలు ఏం మాట్లాడారో తమరే చెప్తారా? బీజేపీకి మంచి పాలనా అనుభవం ఉంది. మీ ఉచిత సలహాలు ఏల? కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు వున్నాయి. అంతలా భయపడకు. నీ పార్టనర్ సీబీఎన్ కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగించు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.