టీడీపీ కుట్రపూరిత మనస్తత్వం ప్రజలకు క్లియర్ గా అర్థమవుతోంది
29 Jan, 2021 12:01 IST
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి నైజాన్ని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. బిజెపీలోకి పంపించగా మిగిలిన ఎంపీలతో మాట్లాడేందుకు చంద్రబాబు బిగించుకున్న అద్దాల తెర చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఉద్యోగులు, ఓటర్లు కరోనాతో పోయినా ఫర్వాలేదు. మేం సేఫ్ గా ఉంటే చాలనే శాడిజం కనిపిస్తోంది. వీళ్ల కుట్రపూరిత మనస్తత్వం ప్రజలకు క్లియర్ గా అర్థమవుతోంది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
జీవితంలో నీవు ఎంత చేయగలవు...ఏం చేయగలవు అన్నది...నిన్ను నువ్వు నమ్మడంలోనే ఉంటుంది. గెలుపు, ఓటమి మధ్య ఉన్న ఒకే ఒక గీత...నమ్మకం. అది నీ మీద నీకు ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయమని ఉదయం చేసిన ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.