విజిలెన్స్ విచారణలో అశోక్ ముసుగు తొలగిపోయింది

24 Aug, 2021 12:07 IST

విశాఖ‌: మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయిందని ఆయన మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోంది. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. వ్యవస్థను భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా?’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.