తుప్పు నాయుడు పార్టీ కొట్టుకుపోవడం ఖాయం
విశాఖ: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. మూడో విడతలో చంద్రబాబునే జనం మడత పెట్టేశారు. కుప్పంలో టీడీపీ కుశాలు కదిపేశారు. పచ్చ పార్టీ భవిష్యత్తు ఏంటో కుప్పంని చూస్తే అర్థం అవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో తుప్పు నాయుడు పార్టీ కొట్టుకుపోవడం ఖాయం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వార్నింగును లెక్క చేయకుండా హైదరాబాద్ లో కూర్చుని సంక్షేమ ప్రభుత్వంపై దుర్మార్గపు కుట్రలు చేసినందుకు పంచాయతీ తీర్పులో కుప్పం ప్రజలూ కన్నెర్ర జేసారు. ఇక తట్టాబుట్టా సర్దుకుని ఇంకో నియోజకర్గాన్ని వెదుక్కోవడమే చంద్రబాబుకు మిగిలిందంటూ అంతకుముందు చేసిన ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.