గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గిస్తాడట. నమ్మాల్సిందేనా?
6 Apr, 2021 12:58 IST
విశాఖ: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మండుటెండల్లో మాలోకం తన పిచ్చి కామెడీతో తిరుపతి ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాడు. ఎండలు తగ్గించి ఉపశమనం కలిగిస్తానని తండ్రిలాగే హామీ ఇచ్చేలా ఉన్నాడు. తిరుపతిలో టీడీపీని గెలిపిస్తే గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గిస్తాడట. నమ్మాల్సిందేనా? అంటూ విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు.