పోలవరం ఎత్తు గురించి బాబు అను ‘కుల’ మీడియా అబద్ధాలు

3 Dec, 2020 11:02 IST

 అమ‌రావ‌తి:  పోలవరం ఎత్తు గురించి బాబు, అను ‘కుల’ మీడియా పదే పదే అబద్ధాలు చెబుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  ఒక అసత్యాన్ని వందల సార్లు చెబితే జనం నమ్ముతారన్న సిద్ధాంతం రూపకర్త జోసెఫ్ గోబెల్స్ మీలాగే భ్రమపడి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాడు. మీ పరిస్థితీ అంతే’ అని విమర్శించారు.

‘రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైంది. మూడు దశల్లో అన్ని గ్రామాల్లో అమూల్ ద్వారా పాల సేకరణ ప్రారంభమవుతుంది. హెరిటేజ్, మిగిలిన ప్రైవేటు డెయిరీల కంటే లీటరుకు రూ.4-5 అదనంగా చెల్లిస్తారు. పాడి పశువుల పంపిణీ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు పుంజుకుంటాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.