రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జి
8 Jan, 2021 12:19 IST
గుంటూరు: రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.శుక్రవారం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ను డీఆర్ఎంతో కలిసి ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... రూ.2.5 కోట్లతో రైళ్ళలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జిని ఏర్పాటు చేస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. జిల్లాకు మరో వారం రోజుల్లో కిసాన్ రైలు వచ్చే అవకాశం ఉందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు.