నిమ్మగడ్డది మొదటి నుంచీ ఏకపక్ష ధోరణే
9 Jan, 2021 12:16 IST
గుంటూరు: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ది మొదటి నుంచి ఏకపక్ష ధోరణే అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఇది సమయం కాదన్నా..పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.