వ్యాక్సినేషన్ తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది
25 Jan, 2021 11:16 IST
తాడేపల్లి:వ్యాక్సినేషన్ తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఎంపీ మిథున్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఎంపీ మీడియాతో మాట్లాడారు. మేం పంచాయతీ ఎన్నికల వాయిదా మాత్రమే కోరామని చెప్పారు. ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం అనే చెప్తున్నామని తెలిపారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుందన్నారు. కొత్త ఓటర్లను వదిలేసి హడావుడిగా నోటిఫికేషన్ ఎందుకని ఎన్నికల కమిషనర్‌ను మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.