వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ మాగుంట పరామర్శ
29 Mar, 2025 16:18 IST
ప్రకాశం జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ ఇటీవల మరణించారు. ఈ క్రమంలో శనివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు. పిచ్చమ్మ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.