త్వరలోనే పోలవరం పూర్తి చేస్తాం
20 Jun, 2019 12:28 IST
పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును అతిత్వరలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా అందజేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు.