సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ బెల్లాన
1 Nov, 2022 12:21 IST
విజయనగరం: చీపురుపల్లి పట్టణం 3వ సచివాలయాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. సకాలంలో పెన్షన్లు అందుతున్నాయని లబ్ధిదారులు ఎంపీకి తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. సచివాలయ సిబ్బంది పనితీరు బాగుందని ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ వెంట చీపురుపల్లి సర్పంచ్ మంగళగిరి సుధారాణి, శ్రీనువాస్ రావు, స్థానిక ఎంపీటీసీ గెరిడి రామదాసు,పార్టీ నాయకులు మీసాల సీతారాములు,మీసాల రామునాయుడు,రౌతు పైడిరాజు తదితరులు ఉన్నారు