కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
24 Sep, 2020 10:54 IST
తిరుపతి: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతి పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బెళగావి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన సురేశ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.